Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు

Author NITYAM NIGHA | 08 Sep 2026, 02:10 PM | Politics, TELANGANA
కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు

స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్‌08


స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం కంచనపల్లి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య నాయకత్వంలో వారు బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు - Additional Image

రఘునాథపల్లి మాజీ ఎంపీపీ వై.కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌ గవ్వని నాగేశ్వరరావు, రఘునాథపల్లి కంటెస్టెంట్‌ సర్పంచ్‌ గూడ కిరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ తాటికొండ రాజయ్య వారికి బీఆర్ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు - Additional Image

కంచనపల్లి గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరడం పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని బీఆర్ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.