Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సంగెంలో చల్లా ధర్మారెడ్డి బర్త్‌డే వేడుకలు.. భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్ శ్రేణులు

Author NITYAM NIGHA | 09 Sep 2026, 07:33 AM | Politics, TELANGANA
    సంగెంలో చల్లా ధర్మారెడ్డి బర్త్‌డే వేడుకలు.. భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్ శ్రేణులు

నిత్యం నిఘా,బ్యూరో:..

— ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

— సంగెం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు

ఇవి కూడా చదవండి


పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను సంగెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. చల్లా ధర్మారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం మరింత సేవ చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచ్ అనుముల భిక్షపతి, వార్డు సభ్యుడు గాదె రాజు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ కడ్దూరి వీరభద్రయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.