Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అదాలత్ కూడలి హోటల్ అగ్నిప్రమాదంలో మరో విషాదం

Author NITYAM NIGHA | 10 Sep 2026, 10:11 AM | Crime, హన్మకొండ
అదాలత్ కూడలి హోటల్ అగ్నిప్రమాదంలో మరో విషాదం

ఫ్లాష్ …నిత్యం నిఘా,బ్యూరో :..


అదాలత్ కూడలి హోటల్ అగ్నిప్రమాదంలో మరో విషాదం

—- భర్త మృతిచెందిన మరుసటి రోజే భార్య పుష్పలత మృతి
ఎంజీఎంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

ఇవి కూడా చదవండి


హనుమకొండ అదాలత్ కూడలిలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోటల్ యజమాని లింగాల కేదారి భార్య పుష్పలత (52) చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొద్ది నిమిషాల క్రితం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇప్పటికే ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య కూడా మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే ప్రమాదంలో దంపతులను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.