Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగింపు డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాం

Author NITYAM NIGHA | 10 Sep 2026, 06:20 PM | Politics, TELANGANA
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగింపు డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాం

నిత్యం నిఘా,బ్యూరో:….

ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగింపు డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాం


గ్రామాభివృద్ధికి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయాలి

ఇవి కూడా చదవండి


కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చిన ఉప సర్పంచుల ఫోరం


జనగామ : ఉప సర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించాలని కోరుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా కొంతమంది సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉప సర్పంచుల ఫోరం జనగామ జిల్లా అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచులు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను వివరించారు.


ఈ సందర్భంగా హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఉప సర్పంచ్ కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధేనని, గ్రామపంచాయతీలో పారదర్శకత, జవాబుదారీతనం, సమిష్టి నిర్ణయాలు ఉండాలంటే సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా తగిన బాధ్యతలు, అధికారాలు ఉండాలన్నారు. అధికారాల కోసం పరస్పరం విభేదించకుండా.. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అన్నదమ్ముల్లా, అక్కా-తమ్ముళ్లలా కలిసి పనిచేయాలని సూచించారు.గ్రామాలకు నిధులు తీసుకురావడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై పాలకవర్గం దృష్టి పెట్టాల్సిన సమయంలో చెక్ పవర్ తొలగించాలని కోరడం బాధాకరమన్నారు. వ్యక్తిగత ఆధిపత్యం కోసం కాకుండా ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ గ్రామాల అభివృద్ధికి ఎవరు అడ్డంకులు సృష్టించినా ఉపేక్షించేది లేదని, అభివృద్ధిని అడ్డుకునే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పినట్లు హరీష్ ముదిరాజ్ తెలిపారు.చెక్ పవర్ కోసం పోరాటం కాదు.. గ్రామాల అభివృద్ధి కోసం సమిష్టి పోరాటం కావాలి. అధికారాలు తగ్గించుకోవడం కాదు.. బాధ్యతలు పెంచుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కార్యదర్శులు పుప్పాల కర్ణాకర్, కిషన్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాజిరెడ్డి, జనగామ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, నర్మెట్ట మండల అధ్యక్షులు మూల కిరణ్ గౌడ్, తరిగొప్పుల మండల అధ్యక్షులు చిలువేరు మహేందర్, జనగామ మండల ఉపాధ్యక్షులు వెంకట రాజ్ గౌడ్, జిల్లా నాయకులు కొండబోయిన రాజు యాదవ్, అనిల్ కుమార్, పాపిరెడ్డి, నరేందర్, ఉడుతల రాజు, సంపత్ రెడ్డి, రవి, సంపత్, సందీప్, కళ్యాణ్ తదితరులతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ఉప సర్పంచులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.