Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పల్లె పల్లెల్లో నల్ల నర్సింలు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

Author NITYAM NIGHA | 16 Sep 2026, 03:49 PM | TELANGANA
పల్లె పల్లెల్లో నల్ల నర్సింలు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

నిత్యం నిఘా,జనగాం జిల్లా:..

— సబ్బండ వర్గాలంతా ఐక్యంగా ముందుకు సాగాలి

— అక్టోబర్‌ 2న జనగామలో జరిగే శత జయంతి వేడుకలను విజయవంతం చేయాలి: కటకం నరసింహులు

జనగామ సబ్బండ వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నర్సింలు శత జయంతి వేడుకలను గ్రామగ్రామాన వైభవంగా నిర్వహించాలని మన ఆలోచన–మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింహులు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.

ఇవి కూడా చదవండి

నల్ల నర్సింలు శత జయంతిని పురస్కరించుకుని బుధవారం జనగామ పట్టణంలోని శ్రీభక్త మార్కండేయ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కటకం నర్సింహులు హాజరై మాట్లాడారు.

బలహీన, అట్టడుగు, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజ అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు, మేధావులను స్మరించుకుంటూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో సబ్బండ వర్గాల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 2న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నల్ల నర్సింలు శత జయంతి వేడుకలకు బీసీలంతా ఐక్యమై తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

నల్ల నర్సింలు స్మారకంగా విగ్రహాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్‌బండ్‌పై కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేముల బాలరాజ్‌, మాజీ జడ్పీటీసీ చింతకింది అరుణ, నరసింహులు స్మారక సమితి కన్వీనర్‌ దాసరి జనార్ధన్‌, నాయకులు చింతకింది కృష్ణమూర్తి, డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎనగందుల కృష్ణ, గునిగంటి రామకృష్ణ, మధుసూదన్‌, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.