Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ విలీనంతో భారతదేశంలో అంతర్భాగంగా మారింది

Author NITYAM NIGHA | 17 Sep 2026, 01:29 PM | Politics, జనగాం
తెలంగాణ విలీనంతో భారతదేశంలో అంతర్భాగంగా మారింది

నిత్యం నిఘా,జనగాం:..

ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేసీఆర్‌ హయాంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశామని వెల్లడి

తెలంగాణ విలీనంతో భారతదేశంలో అంతర్భాగంగా మారింది - Additional Image

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని జనగామ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని అన్నారు. 78 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలతో పాటు స్వదేశీ సంస్థానాలు కూడా ఉండేవని వివరించారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో ప్రజల తిరుగుబాటు కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

తెలంగాణ విలీనంతో భారతదేశంలో అంతర్భాగంగా మారింది - Additional Image

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 3,146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని అన్నారు.

తండాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించడంతో పాటు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్‌ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్యలు పెరిగాయని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.