Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అమరవేణి నర్సాగౌడ్ కుటుంబానికి పరామర్శ

Author NITYAM NIGHA | 23 Sep 2026, 05:33 PM | నిర్మల్
అమరవేణి నర్సాగౌడ్ కుటుంబానికి పరామర్శ

నిత్యం నిఘా,నిర్మల్:.

బైక్ ప్రమాదంలో మృతి చెందిన సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబానికి వివిధ సంఘాల నేతల సానుభూతి

అమరవేణి నర్సాగౌడ్ కుటుంబానికి పరామర్శ - Additional Image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి నర్సాగౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబాన్ని వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీకేఎం నాయకుడు సమ్మయ్య, సింగరేణి గని కార్మిక సంఘం నాయకుడు సత్యం, అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర న్యాయ నాయకుడు బంటు శ్రీనివాస్, రాజన్న ఉదయ్, ఆదివాసీ సంఘం నాయకుడు గంట సత్యం, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అమరవేణి నర్సాగౌడ్ కుటుంబానికి పరామర్శ - Additional Image

అలాగే వివిధ గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు బండారి రమేష్ గౌడ్, సింగం సత్తయ్య గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొండ్ర మనోహర్ గౌడ్, బీసీ సంఘం నేత అనుముల భాస్కర్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రావుల రాంనాథ్, కోరిపల్లి భూషణ్ రెడ్డి తదితరులు కుటుంబాన్ని పరామర్శించారు.