Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాలలో సహకార పోస్టుల భర్తీ ఎప్పుడో?

Author NITYAM NIGHA | 25 Sep 2026, 10:24 AM | Politics, వరంగల్
పరకాలలో సహకార పోస్టుల భర్తీ ఎప్పుడో?

నిత్యం నిఘా,పరకాల:.

ఉమ్మడి వరంగల్‌లో దాదాపు పూర్తి.. పరకాలలో మాత్రం పడకేసిన ప్రక్రియ

ఆశావహుల్లో ఆందోళన.. తమ వంతు కోసం ఎదురుచూపులు

పరకాల, సెప్టెంబర్ 25 (నిత్యం నిఘా ప్రతినిధి):
పరకాల నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు తమకు అవకాశం ఎప్పుడు దక్కుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయినప్పటికీ.. పరకాల నియోజకవర్గంలో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్న పలువురు నేతలు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

ఇతర నియోజకవర్గాల్లో ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో పరకాలలో మాత్రం ఎందుకు జాప్యం జరుగుతుందన్న ప్రశ్నలు ఆశావహుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి పరకాల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఎప్పుడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఆశావహుల కళ్లలో ఆనందం ఎప్పుడో..? పరకాలలో సహకార పోస్టుల భర్తీ ఎప్పుడో?

ఉమ్మడి వరంగల్‌లో దాదాపు పూర్తి.. పరకాలలో మాత్రం పడకేసిన ప్రక్రియ

ఆశావహుల్లో ఆందోళన.. తమ వంతు కోసం ఎదురుచూపులు

పరకాల నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు తమకు అవకాశం ఎప్పుడు దక్కుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయినప్పటికీ.. పరకాల నియోజకవర్గంలో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్న పలువురు నేతలు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

ఇతర నియోజకవర్గాల్లో ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో పరకాలలో మాత్రం ఎందుకు జాప్యం జరుగుతుందన్న ప్రశ్నలు ఆశావహుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి పరకాల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఎప్పుడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆశావహుల కళ్లలో ఆనందం ఎప్పుడో..?