Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చెప్పులు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లడంపై ఎంపీ చామల వివరణ

Author NITYAM NIGHA | 27 Sep 2026, 08:51 AM | Politics, జనగాం
చెప్పులు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లడంపై ఎంపీ చామల వివరణ

నిత్యం నిఘా, జనగాం :.


తొందరపాటులో అనుకోకుండా జరిగింది.. వెంటనే చెప్పులు తొలగించి నివాళులు
సంఘటనపై దళితులు, అంబేద్కర్ అభిమానులకు ఎంపీ హృదయపూర్వక క్షమాపణ.

జనగామ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే కార్యక్రమం సందర్భంగా తాను తొందరపాటులో పాదరక్షలు తొలగించకుండానే విగ్రహం వద్దకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. విషయం గుర్తించిన వెంటనే పాదరక్షలు తొలగించి అంబేద్కర్‌కు భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం, ఓటు హక్కు ఫలితంగానే సాధారణ రైతు కుటుంబానికి చెందిన తనకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో తన దళిత సోదర, సోదరీమణులు తనను సొంత మనిషిగా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన గుర్తుచేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆశయాలే తనను నిరంతరం నడిపించే మార్గదర్శకాలని తెలిపారు.

తొందరపాటులో, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటును దళిత సోదరులు, ప్రజలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల తన మనసులో ఉన్న అపారమైన గౌరవాన్ని గుర్తించాలని కోరుతూ, జరిగిన ఘటనకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.