Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీకేఎం ఆసుపత్రిలో కుక్కల బెడద

Author NITYAM NIGHA | 27 Sep 2026, 08:05 PM | ఆరోగ్యం, వరంగల్
సీకేఎం ఆసుపత్రిలో కుక్కల బెడద

నిత్యం నిఘా,వరంగల్:

ఆసుపత్రి ప్రాంగణంలో యథేచ్ఛగా సంచరిస్తున్న వీధి కుక్కలు

సీకేఎం ఆసుపత్రిలో కుక్కల బెడద - Additional Image

రోగులు, సహాయకుల్లో ఆందోళన.. ఆసుపత్రి యాజమాన్యం స్పందించాలని డిమాండ్

ఇవి కూడా చదవండి

వరంగల్‌లోని సీకేఎం ఆసుపత్రిలో వీధి కుక్కల బెడద రోగులు, వారి సహాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రి ప్రాంగణంలోకి కుక్కలు యథేచ్ఛగా ప్రవేశించి సంచరిస్తుండటంతో రోగులు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

సీకేఎం ఆసుపత్రిలో కుక్కల బెడద - Additional Image

ఆసుపత్రికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు కుక్కల బారిన పడే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఆసుపత్రి పరిసరాల్లో చెత్త, ఆహార వ్యర్థాలు పేరుకుపోతే వాటి కారణంగా కుక్కలు అక్కడికి చేరే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కుక్కల నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రోగులకు వైద్యం అందించే ఆసుపత్రి ప్రాంగణంలోనే కుక్కల సంచారం కొనసాగడం పట్ల ఆసుపత్రి యాజమాన్యం, సంబంధిత మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.