Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో 97ను రద్దు చేయాలి

Author NITYAM NIGHA | 11 Sep 2026, 01:14 PM | ఎడ్యుకేషన్, హన్మకొండ
పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో 97ను రద్దు చేయాలి

నిత్యం నిఘా,బ్యూరో:హన్మకొండ:


పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో 97ను రద్దు చేయాలి

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆధార్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గట్టు యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా గట్టు యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదని, సమస్యలను పరిష్కరించే వరకు విద్యార్థులకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.